ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 7:58 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో SE విచారణ… బాధితులందరి వాంగ్మూలాలు సేకరిస్తారా?

కొత్తగూడెం,అర్జున్ సమాచారం:
మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు (TSNPDCL) టి ఎస్ ఎన్ పి డి సి ఎల్ వరంగల్  ఎస్ ఈ(SE) ఆధ్వర్యంలో కొనసాగుతున్న విచారణపై ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది. విచారణలో బాధితులందరినీ పిలిచి వాంగ్మూలాలు సేకరిస్తారా? గతంలో వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారా? అనే చర్చ జరుగుతోంది.

గతంలో కొత్తగూడెం  డి ఈ పై ఓ ఏ ఈ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన కేసులో భాగంగా వరంగల్ నుంచి ఎస్ ఈ రెండుసార్లు విచారణకు వచ్చినట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. అయితే ఆ రెండు సందర్భాల్లో ఎవరిని పిలిచారు, ఏ అంశాలపై విచారణ చేపట్టారనే విషయం పలువురు ఉద్యోగులకు స్పష్టంగా తెలియదని అంటున్నారు.

జిల్లా అధికారిగా డి ఈ పనిచేసిన సమయంలో పలు ఫిర్యాదులు వచ్చినప్పటికీ వాటిపై సమగ్ర విచారణ జరగలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. డి ఈ (DE ) అనుకూలంగా వచ్చిన ఫిర్యాదులపై విచారణకు ఆదేశాలు ఇచ్చి, వ్యతిరేకంగా ఉన్న ఫిర్యాదులను పక్కన పెట్టారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

ప్రస్తుతం జరుగుతున్న( SE )ఎస్ ఈ విచారణలో డి  ఈ పై వచ్చిన అన్ని ఫిర్యాదులు, బాధితులు, సాక్షుల వాంగ్మూలాలు, సంబంధిత పత్రాలు, పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా పరిశీలించాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఒక ఉద్యోగిపై ఫిర్యాదు వచ్చినప్పుడు అనుసరించే విచారణ విధానమే అధికారిపై వచ్చిన ఫిర్యాదుల విషయంలోనూ ఉండాలని ఉద్యోగులు కోరుతున్నారు.

ఈ విషయమై విచారణ అధికారి తిరుపతిని వివరణ కోరగా, “బాధితులు 50 మందికి పైగా ఉన్నారు. వారందరినీ విచారించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తాం. ఇందులో సాక్షులు కూడా ఉన్నారు” అని తెలిపారు.

ఎస్ ఈ తిరుపతిని భద్రాద్రి న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా వివరాలు తెలపాల్సిన అవసరం లేదని విచారణ విషయాలు బయటకు చెప్పకూడదని ఏదో చిన్న పత్రికలో వస్తే విచారణ చేయాలా తెలపాలా మాకు అందిన ఫిర్యాదులు చాలా ఉన్నాయి విచారణ నెమ్మదిగా చేస్తామని చాలామంది బాధితులు మహబూబాబాద్, ఖమ్మం, కొత్తగూడెం పాల్వంచలో ఉన్నారని. త్వరలో వచ్చి మళ్లీ విచారణ చేపడతామని తెలిపారు.
=========================